నాథూరాం గాడ్సే అసలుసిసలైన దేశభక్తుడంటూ సీనియర్ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్లు పెను దుమారాన్ని రేపాయి. ఎందుకయ్యా.. మీ అన్నాతమ్ముళ్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పరువు ఎందుకు తీస్తున్నావంటూ నెటిజన్లు, మెగా అభిమానులు నాగబాబుపై మండిపడ్డారు. వివాదాస్పద అంశాలపై మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మెగా అభిమానులు నాగబాబును ఏకిపారేశారు. మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అందరూ తనను అర్థం చేసుకోవాలని, తన మాటల్లో అర్థం ఇదేనని మరో ట్వీట్ చేశారు నాగబాబు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం. నిజం చెప్పాలంటే నన్ను విమర్శించే వారికన్నా ఎక్కువగా నాకు ఆయనంటే చాలా గౌరవమని’ నాగబాబు మరో ట్వీట్ చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.  ​నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడు: నాగబాబు సంచలన వ్యాఖ్యలు


కాగా, నిన్న నాథూరాం గాడ్సే జయంతి సందర్బంగా.. ఆయన నిజమైన దేశ భక్తుడని నాగబాబు ట్వీట్ చేయడం తెలిసిందే. అయితే ఆయన ఎందుకు చంపాడు, ఆయన వైపు నుంచి ఆ సమయంలో మీడియా చూపించలేదన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున బరిలోకి దిగిన నాగబాబు ఓటమిపాలు కావడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఏదో విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్